RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాకి చిరంజీవి కూడా పెట్టుబడి పెట్టారా?

by Prasanna |   ( Updated:2023-03-21 03:32:49.0  )
RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాకి  చిరంజీవి కూడా పెట్టుబడి పెట్టారా?
X

దిశ, వెబ్ డెస్క్: ఆస్కార్ సాధించిన సందర్భంగా డివివి దానయ్య ఇంటర్వ్యూ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ ఆర్ఆర్ఆర్ సినిమాకి చిరంజీవి కూడా పెట్టుబడి పెట్టారా? అని అడగగా .. దీనిపై స్పందించిన దానయ్య..

అసలు ఎవరైనా నమ్ముతారా అండి .. చిరంజీవి గారు పెట్టుబడి పెట్టడం ఏంటి ? ఆయనేకేంటి సంబందం? పైగా ఆయన ప్రత్యేకంగా నాకు ఎందుకు పెడతారు? ఆయన కొడుకు రామ్ చరణ్ కు పెట్టుకుంటారు. నాకు పెట్టరు కదా.. నా పెట్టుబడి ఎలా ఉంటుందంటే నాది కొంత ఉంటుంది, కొంత ఫైనాన్స్ తీసుకుంటాను. నేను కావచ్చు .. నా ముందు బాహుబలి ప్రొడ్యూసర్స్ , నా తర్వాత నారాయణ గారు కావచ్చు .. ఎవరైనా ఇలాగే చేస్తారు. రూ. 300 కోట్లు ప్రాజెక్ట్ చేస్తున్నామంటే మొత్తం మేమే పెట్టుకోలేము. వడ్డీకి ఫైనాన్సర్ల తీసుకోని రిలీజ్ సమయంలో వారి డబ్బు వారికి ఇచ్చేస్తాము. మాట్లాడినతను నా ఆఫీసుకొచ్చి చూసినట్టు , నా బ్యాంక్ స్టేట్మెంట్ చూసినట్టు చెప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అంటూ డివివి దానయ్య మాటల్లో చెప్పుకొచ్చారు.

Also Read...

నిహారిక, చైతన్య విడాకులు.. రంగంలోకి చిరంజీవి!

Advertisement

Next Story