ఆ అవార్డు మిస్ అయిన RRR.. గెలిచింది ఏ సినిమానో తెలుసా..?

by sudharani |   ( Updated:2023-01-11 05:07:20.0  )
ఆ అవార్డు మిస్ అయిన RRR.. గెలిచింది ఏ సినిమానో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలోనే ఘన విజయం సాధించిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే 'గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్'లో బెస్ట్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ గెలుచుకుంది. అయితే ఈ అవార్డ్స్‌లోనే ''బెస్ట్ మోషన్ పిక్చర్-నాన్ ఇంగ్లీష్ కేటగిరి'' లో కూడా ఆర్ఆర్ఆర్ నామినేట్ అయింది. కాకపోతే ఈ అవార్డును జస్ట్ మిస్ చేసుకుంది ఆర్ఆర్ఆర్. ''బెస్ట్ మోషన్ పిక్చర్-నాన్ ఇంగ్లీష్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్'' ని 'అర్జెంటినా 1985' అనే స్పానిష్ ఫిల్మ్ గెలుచుకుంది. 1985 లో జరిగిన 'ట్రైల్ ఆఫ్ జుంటాస్' అనే ఒరిజినల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల మనసులను మెప్పించింది. కాబట్టి ఈ ఆవార్డ్‌ను 'అర్జెంటినా 1985' గెలుచుకోవడంతో ఆర్ఆర్ఆర్ జస్ట్ మిస్ అయింది.

Read more:

నాటు నాటు సాంగ్‌'కి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్.. చిరంజీవి రియాక్షన్ ఇదే

Advertisement

Next Story