‘టైగ‌ర్ 3’ నుంచి రొమాంటిక్ అప్ డేట్.. సల్మాన్-కత్రిన లుక్స్ వైరల్

by Anjali |   ( Updated:2023-10-19 12:09:17.0  )
‘టైగ‌ర్ 3’ నుంచి రొమాంటిక్ అప్ డేట్.. సల్మాన్-కత్రిన లుక్స్ వైరల్
X

దిశ, సినిమా: సల్మాన్‌ ఖాన్ అప్ కమింగ్ మూవీ ‘టైగ‌ర్ 3’ నుంచి మరో బిగ్ అప్ డేట్ వెలువడింది. మనీశ్‌ శర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమానుంచి ఇప్పటికే రిలీజైన ఫ‌స్ట్ లుక్, గ్లింప్స్, ట్రైల‌ర్‌ల‌కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వ‌స్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మూవీనుంచి మ్యూజిక‌ల్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ఫ‌స్ట్ సింగిల్ ‘Leke Prabhu Ka Naam’ను ద‌సరా కానుక‌గా అక్టోబ‌ర్ 23న విడుద‌ల చేయ‌బోతున్నట్లు తెలుపుతూ కత్రిన, సల్మాన్‌లకు సంబంధించిన రొమాంటిక్ లుక్ రిలీజ్ చేశారు. ఇక యష్‌ రాజ్‌ ఫిలింస్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌ దీపావళి కానుకగా నవంబర్ 12న‌ విడుదలకాబోతుండగా సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్‌ నటిస్తోంది. షారుఖ్‌ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Advertisement

Next Story