Devara Second Single: దేవర నుంచి రొమాంటిక్ మెలోడి సాంగ్ రిలీజ్.. తారక్-జాన్వీ కెమిస్ట్రీకి ఫిదా

by Anjali |
Devara Second Single: దేవర నుంచి రొమాంటిక్ మెలోడి సాంగ్ రిలీజ్.. తారక్-జాన్వీ కెమిస్ట్రీకి ఫిదా
X

దిశ, సినిమా: జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ కలయికలో తెరకెక్కుతోన్న యాక్షన్, రొమాంటిక్, ఎంటర్‌టైనర్ దేవర చిత్రం కోసం ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. రెండ్రోజుల క్రితమే ఈ మూవీ నుంచి ఓ పోస్టర్ వదిలారు. ఓ మాస్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇవి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ దేవర నుంచి సెకండ్ సాంగ్‌ను విడుదల చేశారు. ‘చుట్టమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీ లోకమే నా మైమరపు, చేతనైతే నువ్వే నన్ను ఆపు’ అంటూ సాగే మెలోడీ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇక ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబరు 27 వ తేదీన తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చగా.. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాస్తున్నారు.





Advertisement

Next Story

Most Viewed