ROJA SELVAMANI: పొట్టి స్కర్ట్‌లో రోజా.. అక్కా నీతులు చెప్తుంది కానీ పాటించదంటూ ట్రోల్స్

by Kavitha |
ROJA SELVAMANI: పొట్టి స్కర్ట్‌లో రోజా.. అక్కా నీతులు చెప్తుంది కానీ పాటించదంటూ ట్రోల్స్
X

దిశ, సినిమా: సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె రెండు సార్లు వైసీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రి బాధ్యతలు కూడా చేపట్టింది. కానీ 2024లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఘోరంగా పరాజయం పొందింది. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తోంది. అయితే తాజాగా 51 ఏళ్ల రోజా ఒక పొట్టి స్కర్ట్‌లో దర్శనమిచ్చిన పిక్స్ కొన్ని నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో రోజా పాత వీడియోలకి సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసిని అనే సాంగ్‌ను యాడ్ చేసి తెలుగు ఆడవారు అంటే ఇలానే ఉండాలి నిండుగా చీర కట్టుకోవాలి చుడీదార్స్ లాంటివి వేసుకోకూడదు అంటూ చిలుక పలుకులు పలికిన రోజా పై ట్రోల్స్ చేస్తున్నారు. అప్పట్లో అన్ని నీతులు చెప్పిన ఆమెను.. అక్కా నీతులు చెప్పడం వరకే పాటించదు అంటూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా ఈ భామను సోషల్ మీడియాలో అయితే గట్టిగానే ఏకిపారేస్తున్నారు.

కాగా ప్రస్తుతం రోజా తెలుగు, తమిళ్‌లో అవకాశాల కోసం ఎదురు చూస్తుంది అనే రూమర్స్ మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి. మరి మళ్ళీ రోజా కోరుకుంటున్న కం బ్యాక్ కానీ అవకాశాలు కానీ వస్తాయో లేదో అనేది చూడాల్సిందే.

(VIDEO LINK CREDITS TO ANAM VENKATA RAMANA REDDY ‘X ’ACCOUNT)

Advertisement

Next Story