- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'నేషనల్ క్రష్' బిరుదు ఇవ్వడం గర్వంగా ఉంది.. రోహిత్ సరాఫ్
దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ యాక్టర్ రోహిత్ సరాఫ్ తనకు ఓ అభిమాని చెప్పిన క్రేజీ విషయాన్ని వెల్లడించాడు. ఇటీవల వచ్చిన 'విక్రమ్ వేద'లో హృతిక్ రోషన్ తమ్ముడు శతక్ పాత్రను పోషించి ప్రశంసలు అందుకున్న నటుడు.. తాజాగా ఓ ప్రేక్షకుడు తనను 'నేషనల్ క్రష్' అని పిలవడం ఆనందంగా ఉందని చెప్పాడు. అంతేకాదు తనకు ఆ బిరుదు ఇవ్వడాన్ని మోస్ట్ క్రేజీయెస్ట్ థింగ్‌గా భావిస్తున్నానన్న రోహిత్.. గతంలో 'నేషనల్ క్రష్' అని సంబోధించినప్పుడు ఇబ్బంది పడేవాడినని, ఈ సినిమా విజయం తర్వాత దానిని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నట్లు తెలిపాడు.
ఇక తన కెరీర్‌లో చాలా అనుభవాలున్నాయన్న యాక్టర్.. 'ఒక అమ్మాయి తన ఉంగరపు వేలిపై నా పేరును టాటూగా వేయించుకుంది. ఇంతకు ముందెన్నడూ నా పట్ల అభిమానులకు అలాంటి కమిట్‌మెంట్ ఉందని అనుకోలేదు. కానీ, ఇప్పుడు నేను అభిమానులకు కావాల్సిన వాడినని అర్థమైంది. ఇంత నిబద్ధత, ప్రేమ, అభిమానం ఉన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా' అంటూ ఎగ్జయిట్ అయ్యాడు. ఇక తాను నటించిన 'మిస్ మ్యాచ్‌డ్' రెండవ సీజన్ అక్టోబర్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారంకానుంది.