Rhea Chakraborty: ప్రియుడితో దొరికిపోయిన హీరోయిన్.. మండిపడుతున్న హీరో ఫ్యాన్స్!

by sudharani |   ( Updated:2024-08-18 08:14:18.0  )
Rhea Chakraborty: ప్రియుడితో దొరికిపోయిన హీరోయిన్.. మండిపడుతున్న హీరో ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: హీరోయిన్ రియా చక్రవర్తి గురించి తెలిసిందే. ‘తూనీగా తూనీగా’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తర్వాత తెలుగులో మరో మూవీ చెయ్యలేదు. చేసినవి తక్కువ చిత్రాలే అయినప్పటికీ ఈ అమ్మడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటుంది. హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో ప్రేమ వ్యవహారం నడిపింది రియా. తర్వాత సూశాంత్ సూసైడ్ చేసుకుని చనిపోవడంతో.. అతడి మరణంలో రియా చక్రవర్తి పేరు ప్రముఖంగా వినిపించింది. దీంతో నెట్టింట ట్రోల్స్ ఎదుర్కొంది. అప్పటి నుంచి ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది రియా. ఓ యంగ్ బిజినెస్ మ్యాన్‌తో ముంబై రోడ్లపై షికారులు చేస్తూ మీడియా కంటికి చిక్కింది.

అతడు మరెవరో కాదు.. జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్. కొంతకాలంగా రియా, నిఖిల్ రిలేషన్‌లో ఉన్నట్లు సోసల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అతడితో కలిసి ఈ బ్యూటీ ముంబై రోడ్లపై బైక్‌పై షికారులు చేస్తూ కనిపించింది. నిఖిల్ హెల్మెట్ ధరించగా.. రియా మాస్క్ పెట్టుకుని దర్శనమిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోస్ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతుండటంతో.. హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Advertisement

Next Story