- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RGV : హార్దిక్ పాండ్యా, నటాషా విడాకులపై ఆర్జీవీ సంచలన కామెంట్స్.. అది స్వర్గం అంటూ..
దిశ, సినిమా : రోజు రోజుకు విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా సెలబ్రిటీస్ వివాహం చేసుకోవడం, కొన్ని రోజుల పాటు కలిసి ఉండి మళ్లీ డివోర్స్ తీసుకోవడం కామన్ అయిపోయింది. ఇప్పటికే చాలా మంది నటీనటులు, సెలబ్రిటీస్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా రామ్‌గోపాల్ వర్మ విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల హార్ధిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. వీరు డివోర్స్ తీసుకుంటున్నామని తెలిపిన తర్వాత ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ చేశారు. విడాకులు అనేవి స్వర్గంలో నిర్ణయించబడుతాయంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఆయన తన ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు. పెళ్ళీలు నరకంలో నిర్ణయించబడితే, విడాకులు స్వర్గంలో నిర్ణయించబడతాయి. వివాహం చేసుకోవడం కంటే జీతం తీసుకునే ఓ నర్స్‌ను నియమించుకోవడం బెటర్, ఈరోజుల్లో పెళ్ళీలు ఇంతకాలం కొనసాగుతున్నాయంటే ఆశ్చర్యంగా ఉంది. ప్రస్తుతం రోజు రోజుకు విడాకుల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవి చూసి పేద ప్రజలు డబ్బు ఖర్చు చేయడం మూర్ఖత్వమే అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక హార్దిక్ పాండ్యా డివోర్స్ తర్వాత ఆర్జీవీ ఈ కామెంట్స్ చేయడంతో, ఆ కపుల్‌ను ఉద్దేశ్యించే ఆర్జీవీ ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు నెటిజన్స్.