హే గరిక.. నువ్వో' గడ్డిపరక'.. ఆర్జీవీ సంచలన కామెంట్స్

by samatah |   ( Updated:2022-10-11 02:59:55.0  )
హే గరిక.. నువ్వో గడ్డిపరక.. ఆర్జీవీ సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వివాదాలు సృష్టించడమే కాదు వాటికి వివరణ ఇవ్వడంలో ఆయనకు మించిన తోపులేరన్నది తమ అభిమానుల నమ్మకం. ఇక ఎపపుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వర్మ.. ప్రతి ఇష్యూపై తనదైన శైలిలో స్పందిస్తుంటాడు. కాగా తాజాగా, గరికపాటికి, మెగస్టార్ చిరంజీవికి మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అలాయ్, బలాయ్ కార్యక్రమంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

అయితే ఈ సంఘటనపై రామ్ గోపాల్ వర్మ సెటైర్ వేశారు. హే.. గరిక పాటి నువ్వు గడ్డిపరకతో సమానం, మా మెగాస్టార్ చిరంజీవిని ఏమైనా అంటే క్షమించేది లేదంటూ తన ట్విట్టర్ అకౌంట్‌లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హే గూగురు పాటి నరసింహ రావు, తమరు గ(డ్డిప)రిక అయితే మా చిరు నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకొండి అంటూ మండిపడ్డాడు.

ఇవి కూడా చదవండి : మెగాస్టార్ 'గాడ్ ఫాదర్'పై సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రశంసలు

Advertisement

Next Story