తండ్రి చనిపోతే చూడటానికి కూడా వెళ్లని ఆర్జీవీ .. ఎందుకో తెలుసా?

by samatah |   ( Updated:2023-07-01 08:59:58.0  )
తండ్రి చనిపోతే చూడటానికి కూడా వెళ్లని ఆర్జీవీ .. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వివాదాలు సృష్టించడమే కాకుండా వాటికి వివరణ ఇవ్వడంలో కూడా ఈయనక మించిన తోపు లేరన్నది తన అభిమానుల నమ్మకం. ఇక ఈ ప్రపంచంలో తనకు మాత్రమే నిజమైన స్వేచ్ఛ ఉంది అనేలా ప్రవర్తిస్తుంటాడు. తనకు నచ్చింది నచ్చినట్లుగా చేస్తూ వెళ్లిపోతాడు. అయితే ఆర్జీవీ తాజాగా, చావు పుట్టుకలపై ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.

తాను మాట్లాడుతూ.. నానకు చావులంటే అస్సలే ఇష్టం ఉండదు, ఎవరైన చనిపోయినా అస్సలే వెళ్లను అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా,నా కాలేజ్ ఫ్రెండ్ లో ఒకతను తన తల్లి ఈమధ్య మరణించింది అని నాకు ఒక మెసేజ్ పెట్టాడు కానీ నేను రిప్లై ఇవ్వలేదు, మా అమ్మ చనిపోయింది అన్నా రిప్లే ఇవ్వలేదని తను ఫీలయ్యాడు. కానీ నేను అవి ఏవి పట్టించుకోను అన్నాడు.

ఇక ఒకసారి మా నాన్న చనిపోయినప్పుడు కూడా ఇంటికి చుట్టాలు వచ్చి ఏడవడం చూసి ఇష్టం లేక నేను మా నాన్నను కూడా చూడకుండా అక్కడ నాన్న ఫోటో ఉంటే తీసేయమని చెప్పాను. ఇంక ఎప్పుడు పెట్టడానికి వీలు లేదని చెప్పాను, ఎందుకంటే ఆ ఫోటో చూసినప్పుడల్లా నాన్నగారు లేరన్న విషయం గుర్తుకు వస్తుంది అది నాకు ఇష్టం ఉండదన్నారు.

Read more : వరుణ్ తే‌జ్ ఎంగేజ్‌మెంట్ కాకుంటే.. ఆయనను నేనే పెళ్లి చేసుకునేదాన్ని నటి కామెంట్స్ వైరల్

Advertisement

Next Story