రెహమాన్‌కు అంత సీన్ లేదు.. జయహో కంపోజ్ చేసింది ఆ సింగర్.. ఆస్కార్ రావాల్సింది అతనికే.. ఆర్జీవీ కామెంట్స్ వైరల్

by Sujitha Rachapalli |   ( Updated:2024-04-21 12:52:10.0  )
రెహమాన్‌కు అంత సీన్ లేదు.. జయహో కంపోజ్ చేసింది ఆ సింగర్.. ఆస్కార్ రావాల్సింది అతనికే.. ఆర్జీవీ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: ఆర్జీవీ మాటలు వింటే ముందు కోపం వస్తుంది కానీ ఆలోచిస్తే మాత్రం ఆయన చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. బోల్డ్ గా మాట్లాడినా అందులో పక్కా నిజం ఉందన్నట్లే చెప్తాడు. ఆడవాళ్ల అందానికి ఎవరైనా దాసోహం కావాల్సిందే.. ఇందుకు తానేమీ అతీతం కాదని సిగ్గు లేకుండా చెప్పేస్తాడు. ఏ పొలిటికల్ పార్టీకి భయపడకుండా నిర్మొహమాటంగా తన అభిప్రాయం వ్యక్తం చేస్తాడు. కాగా తాజాగా ఆయన ఏఆర్ రెహమాన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

నిజానికి జయ హో సాంగ్ కు రెహమాన్ ఆస్కార్ అవార్డు అందుకున్నాడు కానీ అసలు కంపోజ్ చేసింది ఆయన కానే కాదని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆస్కార్ అందుకునే అర్హత ఆయనకు లేదని.. సింగర్ సుఖ్విందర్ సింగ్ కంపోజ్ చేస్తే అతను క్రెడిట్ లాగేసుకున్నాడని ఆరోపించాడు. దీంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరి దీనిపై రెహమాన్ రిప్లయ్ ఇస్తాడా లేదా చూడాలి.

Read More..

అవకాశాలు కావాలంటే పడుకోవాల్సిందే.. నా సినిమా కోసం నేను అదే చేశా.. ఓపెన్ గా మాట్లాడిన కస్తూరి..

Advertisement

Next Story