పవన్ కల్యాణ్ కొడుకు అకీరా నందన్ సినీ ఎంట్రీ పై రేణు దేశాయ్ ఆసక్తికర కామెంట్స్!

by Hamsa |   ( Updated:2023-10-14 08:21:28.0  )
పవన్ కల్యాణ్ కొడుకు అకీరా నందన్ సినీ ఎంట్రీ పై రేణు దేశాయ్ ఆసక్తికర కామెంట్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె తన పిల్లలను చూసుకుంటూ పలు వెకేషన్స్‌కి వెళ్తూ ఎంజాయ్ చేసింది. అలాగే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉంది. ఇటీవల రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా అక్టోబర్ 20న థియేటర్స్‌లో విడుదల కానుంది.

తాజాగా, ప్రేమోషన్స్‌లో పాల్గొన్న రేణు దేశాయ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. అకీరా నందన్ ఎప్పుడు ఇండస్ట్రీలోకి వస్తాడని యాంకర్ అడగ్గా.. ‘‘అకీరా ప్రస్తుతం మ్యూజిక్, ఫిల్మ్ ప్రొడక్షన్, స్క్రిప్ట్ రైటింగ్ కు సంబంధించిన కోర్సులు చేస్తున్నాడు. అతని ధ్యాస వీటిపైనే ఉంది. నటుడు కావాలని అనుకోవడం లేదు. అకీరా చూడటానికి అందంగా.. హీరోలా ఉంటాడు. నటుడికి కావాల్సిన లక్షణాలు ఉన్నాయి. అతని నాన్న, పెద్దనాన్న హీరోలు, నేనో నటిని. నా కుమారుడిని హీరోగా తెరపై చూడాలని నాకూ ఉంది. అయితే.. ఆ ఆశ అకీరాకు కూడా ఉండాలి కదా. ఇప్పటికైతే నేను, పవన్ కల్యాణ్ హీరో అవ్వాలని అకీరాను బలవంతం చేయడం లేదు’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed