మూగ జీవాల ఆపరేషన్ కోసం విరాళం.. గొప్ప మనసు చాటుకున్న రేణు దేశాయ్

by Anjali |   ( Updated:2023-11-01 04:24:05.0  )
మూగ జీవాల ఆపరేషన్ కోసం విరాళం.. గొప్ప మనసు చాటుకున్న రేణు దేశాయ్
X

దిశ, వెబ్‌డెస్క్: కాస్ట్యూమ్ డిజైనర్‌గా, మోడల్‌గా హీరోయిన్‌గా.. టాలీవుడ్ పరిశ్రమలో మల్టీ టాలెంటెడ్ ఉమెన్‌గా తనకంటూ స్పెషల్ గుర్తింపు సంపాదించుకుంది పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్. పవన్‌ హీరోగా నటించిన ‘బద్రి’ సినిమాతో టాలీవుడ్‌లోకి కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. మళ్లీ నెక్ట్స్ మూవీ కూడా తన భర్తతోనే ‘జానీ’ చిత్రంలో నటించింది. ఈ క్రమంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లకు వివాహం చేసుకుని అఖీరా, ఆద్యలకు జన్మనిచ్చారు. కానీ పలు కారణాల వల్ల రేణు దేశాయ్, పవన్ విడిపోయారు. పిల్లల కోసం సినిమాలకు దూరమైన ఈ నటి 20 ఏళ్ల తర్వాత ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో హేమలత లవణం పాత్రలో అలరించారు. ఈ సినిమాలో రేణు దేశాయ్‌కు పాత్రకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వనుందని కూడా పలు వార్తలు వినిపించాయి. ఇదంతా పక్కన పెడితే..

తాజాగా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. కుక్కల ఆపరేషన్ కోసం విరాళం ఇచ్చారు. ‘ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తన అనుచరులను అభ్యర్థించింది. కనీసం 100 పంపాలని కోరింది. మొత్తం రూ. 55 వేల వరకు ఖర్చు అవుతుంది. నా వంతుగా రూ. 30 వేలు ఇస్తాను. దయచేసి మిగతా మనీ ఎవరైనా సహాయం చేయగలరు.’ అని తన ఫాలోవర్లను విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రేణు దేశాయ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూగ జీవాల కోసం చాలా మంచి పని చేస్తున్నారంటూ ఈ నటిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


Advertisement

Next Story