Renu Desai: ‘అందరూ ఏడిపించి పోతారు’.. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..

by Prasanna |   ( Updated:2023-04-04 06:47:49.0  )
Renu Desai: ‘అందరూ ఏడిపించి పోతారు’.. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..
X

దిశ, సినిమా: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్ మోడల్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌, యాక్టర్‌ అండ్ డైరెక్టర్‌‌గా నిరూపించుకుంది. బద్రి, జానీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ను పెళ్లి చేసుకుని, అభిప్రాయబేధాలతో 2012లో విడాకులు తీసుకుంది. తర్వాత తన ఇద్దరు పిల్లలతోనే జీవిస్తున్న ఆమె.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ అండ్ కెరీర్ గురించి అప్ డేట్ ఇస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె తాజా పోస్ట్ చర్చకు దారి తీస్తోంది. ‘మండుటెండలో చల్లని గాలిలా అనుకోకుండా కొందరు మన జీవితంలోకి వస్తారు. వారి చూపులు మీ హృదయాలతో మాట్లాడతాయి. వారితో మీరు గడిపిన కొద్ది గంటలు జీవితాంతం గుర్తుండి పోయేలా, చెరగని ముద్ర వేస్తాయి. అయితే అలాంటి వ్యక్తుల ఎడబాటు తీరని వేదనను మిగుల్చుతాయి. కానీ వారు మాత్రం ఆనందంలో ఉండిపోతారు’ అని రాసుకొచ్చింది. ఇక ఇది చూసిన నెటిజన్లు..‘తనను ఎవరు అంతగా బాధ పెట్టారు?’ , ‘పవన్‌ను ఉద్దేశించి చెప్తుందా?’ అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: కర్మ ప్రకారమే ఇలా జరిగిందంటూ .. సమంతపై తమిళ నిర్మాత షాకింగ్‌ కామెంట్స్

Advertisement

Next Story