ఆద్యకు సంబంధించిన షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన రేణు దేశాయ్.. ఇన్నిరోజులు ఎందుకు రహస్యంగా ఉంచింది?

by Jakkula Samataha |   ( Updated:2024-05-13 05:09:12.0  )
ఆద్యకు సంబంధించిన షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన రేణు దేశాయ్.. ఇన్నిరోజులు ఎందుకు రహస్యంగా ఉంచింది?
X

దిశ, సినిమా : మదర్స్ డే రోజు రేణు దేశాయ్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె చేసిన పోస్ట్‌లో ఆద్య ఇన్ స్టా‌గ్రాం ఖాతా అందరికీ కనిపిస్తుంది. అయితే చాలా మందికి పవన్ కూతురు ఆద్యకు ఇన్ స్టా ఉందని తెలియదు. ఈ విషయం చాలా రోజుల నుంచి సీక్రెట్‌గా ఉంచింది రేణ దేశాయ్. కానీ మదర్స్‌డే సందర్భంగా తన కూతురు.. రేణు దేశాయ్ మీద ప్రేమతో ఓ పోస్ట్ చేసింది. ఇక ఆద్య పోస్టు చూసి మురిసిపోయిన రేణూ.. తన కూతురు పోస్ట్‌ను తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. కానీ ఆద్య ఐడీ మాత్రం కనిపించకుండా మెయింటైన్ చేసింది.

ఆద్య ఇన్‌స్టా రహస్యంగా ఉంచడానికి కారణం ఇదేనా..

రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు.. ఆద్య,అకీరా. ఇక చిన్న మనస్పర్థల కారణంగా రేణు, పన్ కళ్యాణ్ నుంచి విడిపోయి, ఒంటరిగా తన పిల్లను చూసుకుంటూ ఉంటుంది. ఇక ఇప్పటికీ కొన్ని సందర్భాల్లో రేణు నెగిటివ్ కామెంట్స్‌ను ఫేస్ చేస్తూ వస్తుంది. అయితే ఆద్య ఇన్ స్టా గ్రామ్ ఖాతా తెలిస్తే కూడా ఫ్యాన్స్ గొడవలు, నెగిటివ్ కామెంట్స్,యాంటీ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తారని తన ఖాతను రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఇక ఇలాంటి గొడవల్లోకి తన కూతురును తీసుకరాకూడదనే రేణూ ఈ నిర్ణయం తీసుకున్నదంట. ఇక ఇది చూసిన ఫ్యాన్స్ ఆద్య సంతోషంగా స్నేహితులతో గడుపుతుందనుకున్నాం కానీ అకౌంట్ కూడా ఉందా అని తెలిసి షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed