ఏకంగా తమ పిల్లలతోనే ఆ పని చేయబోతున్నా రేణుదేశాయ్.. ఒక్కసారిగా బాంబ్ పేల్చేసిందిగా!

by Anjali |   ( Updated:2023-10-20 14:50:37.0  )
ఏకంగా తమ పిల్లలతోనే ఆ పని చేయబోతున్నా రేణుదేశాయ్.. ఒక్కసారిగా బాంబ్ పేల్చేసిందిగా!
X

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల ఏదో ఒక వార్తతో తరచూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా.. రవితేజ హీరోగా నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం నేడు (అక్టోబరు 20)థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలయ్యింది. కాగా ఈ సందర్భంగా రేణు దేశాయ్ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా ప్రమోట్ చేస్తోంది. తన జీవితం, కెరీర్‌కు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్‌ ముచ్చట్లను పంచుకుంటుంది. తన ఆస్తి పాస్తుల గురించి.. పిల్లల చదువు గురించి మాట్లాడుతూ.. ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ తర్వాత దర్వకురాలిగా కెరీర్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నానని చెప్పి ఒక్కసారిగా బాంబ్ పేల్చింది. దర్శకురాలిగా రేణుకు కొంత అవగాహన ఉందని, తమ పిల్లల్నే ప్రధాన పాత్రల్లో పెట్టి ఓ లవ్ స్టోరీతో సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నానని, మళ్లీ టాలీవుడ్‌లో బిజీగా కాబోతున్నానంటూ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి : నీకేందుకు సినిమాలు, ఏం సాధిస్తావ్ అంటూ మొహం మీదే అనేది: స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story