శృంగారానికి ముందు రిహార్సల్స్.. హీరామండి రొమాంటిక్ సీన్స్ పై సంచలన కామెంట్స్ చేసిన మనిషా కోయిరాల

by Dishafeatures1 |
శృంగారానికి ముందు రిహార్సల్స్.. హీరామండి రొమాంటిక్ సీన్స్ పై సంచలన కామెంట్స్ చేసిన మనిషా కోయిరాల
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ ‘హీరామండి: ది డైమండ్ బజార్’. 1940ల కాలంలో భారత్ బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి హీరామండి అనే రెడ్ లైట్ ప్రాంతంలో, జీవనం సాగించిన డ్యాన్సర్ల జీవితాల గురించి ఈ సిరీస్‌లో దర్శకుడు భన్సాలీ చూపించారు. అంటే బ్రిటిష్ పాలనలో దారుణాలు ఎదుర్కొన్న ఆ మహిళల గురించి ఎన్నో విషయాలను ఈ సిరీస్‌లో చూపించాడు. కాగా, ఈ సిరీస్‌లో మనీష కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్, షార్మీన్ సెగల్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం అందరికీ తెలిసినదే.

తాజాగా మనీషా కోయిరాల ఈ సిరీస్‌లో చేసిన ఆమెకు ప్రశంసలు రావడంతో బోల్డ్ సీన్‌పై విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా వాటిపై స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. “నేను చేసే క్యారెక్టర్ గురించి గానీ, నేను చేసే సీన్ల గురించి గానీ సంజయ్ ముందే నాకు క్లియర్ కట్ గా చెప్పాడు. రొమాంటిక్ సీన్స్ గురించి కూడా అతను చెప్పాడు. నిజానికి సంజయ్ ఒక మేకర్ గా తను ఏం చేయాలి, ఎలాంటి సీన్ రాయాలనేది ముందే డిసైడ్ చేసుకుని పెట్టుకుంటాడు.

కాబట్టి వాటిని మనం తెరమీద చూపించడంలో ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు మన ప్రొఫెషన్ లో భాగంగా ఇవన్నీ చేసుకుంటూ వెళ్లడం సర్వసాధారణమే” అంటూ చెప్పింది..ఇక ఏ సీనైనా చాలా బాగా రావడానికి సంజయ్ ఆ సీన్ ను ముందుగా రిహార్సల్స్ చేయిస్తాడు. ఇక శేఖర్ తో చేసిన రొమాంటిక్ సీన్స్ కూడా ముందు మేము రిహార్సల్స్ చేసి ఆ తర్వాత టేక్ కి వెళ్లాం.. ఏ ఏజ్ లో అయినా మనం ఒక ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు దానికి 100% న్యాయం చేయడంలో తప్పేమీ లేదు. దానికి నేనేమీ ఇబ్బంది పడలేదు అంటూ తను ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చింది.

Next Story

Most Viewed