‘సూర్యాపేట్ జంక్షన్’ చిత్ర బృందం నెటిజన్లకు బంపర్ ఆఫర్.. సాంగ్ రీల్ చేస్తే..

by Vinod kumar |
‘సూర్యాపేట్ జంక్షన్’ చిత్ర బృందం నెటిజన్లకు బంపర్ ఆఫర్.. సాంగ్ రీల్ చేస్తే..
X

దిశ, సినిమా: ‘సూర్యాపేట్ జంక్షన్’ చిత్ర బృందం నెటిజన్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ మూవీలోని ‘మ్యాచింగ్ మ్యాచింగ్’ సాంగ్ రీల్ చేసి లక్ష గెలచుకోమంటూ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ‘మీరు మా టీజర్ మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కాంటెస్ట్‌లో రిజిస్టర్ అవ్వాలి. తర్వాత ‘మ్యాచింగ్ మ్యాచింగ్’ ఆడియోను వీడియో రీల్ చేసి ‘సూర్యాపేట్ జంక్షన్’ స్ట్రిప్‌లో పోస్ట్ చేసి @yogalaxmiartcreations #suryapetjunctio ట్యాగ్ చేయండి. మాకు పంపించిన వాటిలో బాగా కంపోజ్ చేసిన వీడియో ను సెలెక్ట్ చేసి మొదటి బహుమతిగా లక్ష రూపాయల ప్రైజ్ మనీ ఇస్తాం. రెండవ బహుమతిగా 10 బెస్ట్ వీడియోస్‌కు రూ.10వేలు, మూడవ బహుమతి గా రూ.5 వేలు ఇవ్వబడును. ట్రై చేయండి ఆ లక్ష మీరే గెలుచుకోవచ్చు’ అంటూ మూవీని భిన్నంగా ప్రమోట్ చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed