తెలుగు కల్చర్, ప్రేక్షకుల బిహేవియర్‌పై నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. మధ్యతరగతి అమ్మాయినే అంటూ

by samatah |   ( Updated:2023-07-24 06:12:29.0  )
తెలుగు కల్చర్, ప్రేక్షకుల బిహేవియర్‌పై నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. మధ్యతరగతి అమ్మాయినే అంటూ
X

దిశ, సినిమా: మలయాళ యంగ్ బ్యూటీ రెబ్బా మోనికా జాన్‌.. తెలుగు కల్చర్, ప్రేక్షకుల బిహేవియర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ‘సామజవరగమన’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసిన నటి.. రీసెంట్‌గా ఓ సమావేశంలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘నేను మలయాళీ అయినా బెంగళూరులో పుట్టి పెరిగాను. మలయాళంలో నటించిన ‘ఫొరెన్సిక్‌’ చిత్రంతో మంచి పేరొచ్చింది. ‘సామజవరగమన’ వంటి కుటుంబ కథా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కావడం ఆనందంగా ఉంది. సరయు అనే మధ్యతరగతి అమ్మాయిగా నా పాత్రకు మంచి గుర్తింపు లభించింది. దక్షిణాది భాషల్లో కొన్ని సినిమాల్లో నటించినా.. తెలుగు ఇండస్ట్రీ మాత్రం నా హృదయానికి దగ్గరగా అనిపించింది. ఇక్కడి ప్రజల నాపట్ల ఎంతో ఆప్యాయత కనబరిచారు. తెలుగువారు చాలా ప్రత్యేకం అనే భావన కలిగింది. ప్రస్తుతం మరిన్ని కథలు వింటున్నా. మంచి స్టోరీతో మరోసారి మిమ్మల్ని అలరిస్తానని నమ్ముతున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి :: Rakul Preet Singh : గ్రీన్ బికినీలో హాట్ థైయ్స్ చూపిస్తూ రెచ్చిపోయిన...

Advertisement

Next Story