- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Laxman Karya: నా తప్పు తెలుసుకున్నాను.. ఇకపై అలా చెయ్యను.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో విడుదల అవుతున్న తాజా సినిమా 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. రావు రమేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో.. రావు రమేష్ సరసన ఇంద్రజ.. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు. ఇక ఆగస్టు 23న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉండటంతో ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు చిత్ర బృందం.
ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్ కార్య మీడియాతో ముచ్చటించారు. ‘సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా 'హ్యాపీ వెడ్డింగ్' చేశా. దర్శకుడిగా 'మారుతి నగర్ సుబ్రమణ్యం' నా రెండో సినిమా. 'హ్యాపీ వెడ్డింగ్'లో ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవడానికి ఆర్నెల్లు పట్టింది. ఈ సారి తప్పు జరగకూడదని, ఎలాగైనా సక్సెస్ కొట్టాలని ముందు కథ, హీరో క్యారెక్టర్ రాసుకున్నా. మిడిల్ ఏజ్డ్ ఫాదర్ కథ ఇది. ఇందులో రావు రమేష్ ఆ పాత్రలో అద్భుతంగా చేశారు. కచ్చితంగా ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.