దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పై శివకార్తికేయన్ వైరల్ కామెంట్స్..

by Kavitha |   ( Updated:2024-03-06 03:56:44.0  )
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పై శివకార్తికేయన్ వైరల్ కామెంట్స్..
X

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ ఇటివల ‘ఆయలన్’ మూవీతో వచ్చి మంచి హిట్ అందుకోగా.. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. రాజ్‍కుమార్ పెరియసామి దర్శకత్వంలో ‘అమరన్’ అనే చిత్రం చేస్తున్నారు శివ.. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‍గా నటిస్తుండగా దిగ్గజ నటుడు కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. దీంతో పాటుగా స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్‍తోనూ శివకార్తికేయ మరో మూవీ (SK 23) చేస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‍గా నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివకార్తికేయన్ దర్శకుడు సందీప్ వంగా..‘యానిమల్’ మూవీ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు..

నటుడు మాట్లాడుతూ ‘ ‘యానిమల్’ సినిమా చూసి నేను థ్రిల్ అయ్యాను. సందీప్ రెడ్డి వంగా.. క్రాఫ్ట్‌ నాకు బాగా నచ్చుతుంది. ఆయన మ్యూజిక్‍ను ఉపయోగించుకునే విధానం అద్భుతంగా ఉంది. ‘యానిమల్’ సినిమా చూసేటప్పుడు నాకు థ్రిల్లింగ్‍గా అనిపించింది. ఆయన సినిమాల కంటే.. ఆయన ఇంటర్వ్యూలకు నేను అభిమానిని. సమాధానాల విషయంలో ఆయన చాలా ముక్కుసూటిగా ఉంటారు. అది నాకు నచ్చుతుంది’ అని తెలిపారు శివ. మనకు తెలిసి ఇప్పటి వరకు తమిళ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది యాక్టర్స్ ఈ ‘యానిమల్’ సినిమాను తీవ్రంగా విమర్శించారు. కానీ శివకార్తికేయన్ మాత్రం తనకు ఆ చిత్రం నచ్చిందని చెప్పారు.

Advertisement

Next Story