Raayan Movie: ‘రాయన్’ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ..?

by Prasanna |
Raayan Movie: ‘రాయన్’ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ..?
X

దిశ, సినిమా: ధనుష్ డైరెక్టర్ గా, హీరోగా నటించిన కొత్త సినిమా ‘రాయన్’. ఈ మూవీ రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లోనే రూ. 6 కోట్లకు పైగా వసూలు చేసింది. గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ జులై 26న థియేటర్లలో సందడీ చేసింది. అన్ని చోట్లా పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో ధనుష్ తో పాటు తెలుగు హీరో సందీప్ కిషన్ కూడా ముఖ్య పాత్రలో నటించాడు.

ధనుష్ సినీ కెరియర్లో తన 50వ సినిమాగా వచ్చిన “రాయన్” లో ప్లస్ లు, మైనస్ లు ఉన్నాయి. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ధనుష్ చాలానే జాగ్రత్త పడ్డాడు. రొటీన్ లైన్ తీసుకునే కొత్తగా చూపించాడు. మాస్ ని ఇష్టపడే వారికీ ఈ సినిమా బాగా నచ్చేస్తుంది. ఈ మూవీలో చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే సినిమాటోగ్రఫీ ఇది మూవీకి చాలా ప్లస్ అయింది.

తాజాగా ఈ సినిమాకి సంబందించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ సన్ నెక్స్ట్ దక్కించుకున్నట్టు సమాచారం. ఇక స్ట్రీమింగ్ డేట్ ను అతి త్వరలో అనౌన్స్ చేయనున్నారు.

Advertisement

Next Story