ప్రభాస్ ‘సలార్’ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరో కొడుకు.. ఆ కీ రోల్ అతనిదేనా?

by sudharani |   ( Updated:2023-12-23 09:16:29.0  )
ప్రభాస్ ‘సలార్’ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరో కొడుకు.. ఆ కీ రోల్ అతనిదేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘సలార్’. భారీ అంచనాల మధ్య ఈ సినిమా డిసెంబర్ 22న గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజై.. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. అంతే కాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ సినిమాలో నటించిన ప్రతిఒక్కరూ కూడా అద్భుతంగా నటించారు. ఇక ప్రభాస్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డైలాగులు ఎక్కువ లేకపోయినప్పటికీ.. కటౌట్‌తో, యాక్టింగ్, ఫైట్స్‌తో అందరినీ మెప్పించాడు. అయితే.. సలార్ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్‌తో సమానంగా గుర్తింపు తెచ్చుకుంది పృథ్విరాజ్ పాత్ర.

పృథ్విరాజ్ చిన్నపటి పాత్ర చేసిన కుర్రాడి గురించి ప్రస్తుతం నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ కుర్రాడు అద్భుతంగా నటించడంతో.. ఇంతకీ ఎవరు ఆ కుర్రాడు అంటూ తెగ వెతికేస్తున్నారు. ఆ కుర్రాడు మరెవరో కాదు.. టాలీవుడ్ సీనియర్ హీరో రవితేజ‌ కజిన్ బ్రదర్ కొడుకు అని తెలుస్తోంది. అంటే వరుసకి రవితేజకు కొడుకు అవుతాడన్న మాట. అతని పేరు కార్తికేయ్ దేవ్. ఇతడు పదో తరగతి చదువుతున్నాడట. ‘సలార్’లో పృథిరాజ్ పాత్ర కోసం చాలా మందిని ఆడిషన్ చేసి చివరికి కార్తికేయ దేవ్‌ని తీసుకున్నారట ప్రశాంత్ నీల్. ‘సలార్’ మూవీలో కార్తికేయ్ దేవ్ పర్ఫామెన్స్‌కు అందరు ఫిదా అవుతున్నారు.

Advertisement

Next Story