Ravi Teja: ఈ దేశాన్ని పీడుస్తుంది దరిద్రం కాదు నల్లదనం.. హైప్ పెంచేస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ టీజర్

by sudharani |
Ravi Teja: ఈ దేశాన్ని పీడుస్తుంది దరిద్రం కాదు నల్లదనం.. హైప్ పెంచేస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ టీజర్
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోవడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుపుతుంటున్న ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్లలో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

ఇక రిలీజ్ సమయం కూడా దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా ‘మిస్టర్ బచ్చన్’ నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ‘A సైడ్ చిరంజీవి పాటలు.. B సైడ్ బాలకృష్ణ’ అంటూ ఓల్డ్ సాంగ్‌తో స్టార్ట్ అయినా ఈ టీజర్‌లో.. ‘ఈ దేశాన్ని పీడుస్తుంది దరిద్రం కాదు నల్లదనం’ అంటూ మాస్ యాక్షన్‌లో రవితేజ మరోసారి మాస్ మహా రాజాగా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక భాగ్యశ్రీ బోర్సే ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.


Advertisement

Next Story