- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఛాంగురే బంగారు రాజా’.. టీజర్ లాంచ్ చేసిన రవితేజ
దిశ, సినిమా: ప్రతిభావంతులైన యువ ఫిల్మ్ మేకర్స్‌తో కంటెంట్- రిచ్ సినిమాలు తీయడానికి.. ఆర్.టీ టీమ్‌వర్క్స్‌ను హీరో రవితేజ స్థాపించిన విషయం తెలిసిందే. కాగా ఈ ప్రొడక్షన్ నుంచి రాబోతున్న ‘ఛాంగురే బంగారు రాజా’ టీజర్‌ను తాజాగా రవితేజ లాంచ్ చేశారు. సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌తో కలిసి రవితేజ నిర్మిస్తుండగా.. కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
సునీల్ వాయిస్‌తో కుక్కను పరిచయం చేసిన సీన్‌తో ప్రారంభమైన టీజర్ మూడు పాత్రల చుట్టూ తిరిగే కథగా తెలుస్తుండగా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. హిలేరియస్, గ్రిప్పింగ్ కథనంతో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. ఇక కార్తీక్ రత్నం, సత్య, రవిబాబు, గోల్డీ నిస్సీ, నిత్య శ్రీ, ఎస్తర్ నోరోన్హా, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్న సినిమాకు కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తుండగా త్వరలోనే ఈ సినిమాను విడుదల తేది ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.