ఫ్లాప్ దర్శకుడికి రవితేజ మరోసారి అవకాశం?

by Shiva |   ( Updated:2023-03-23 04:17:10.0  )
ఫ్లాప్ దర్శకుడికి రవితేజ మరోసారి అవకాశం?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం వరుస లైనప్ తో ఫుల్ బిజీ అయిపోయాడు రవితేజ. ‘ధమాకా’ ఇచ్చిన సక్సెస్ తో వచ్చే నెల ‘రావణాసుర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘టైగర్ నాగేశ్వరరావ్’, ‘ఈగల్’ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వీటి తర్వాత రవితేజ దర్శకుడు వీరు పోట్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. తొలుత వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలకు రైటర్ గా వర్క్ చేసిన వీరు పోట్ల దర్శకుడిగా బిందాస్, దూసుకెళ్తా, రగడ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అనంతరం సునీల్ హీరోగా ‘ఈడు గోల్డ్ ఎహే’ సినిమా తీసి ఫ్లాప్ అందుకున్నాడు.

ఆ తర్వాత కొన్ని కథలు రాసుకున్నాడు కానీ ఏది సెట్ అవ్వలేదు. తాజాగా వీరు పోట్ల రవితేజకి ఓ స్క్రిప్ట్ చెప్పి ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడని సమాచారం. రవితేజ కి కథ బాగా నచ్చడంతో తన లైనప్ పక్కన పెట్టి మరీ ఈ దర్శకుడికి డేట్స్ ఇస్తున్నాడని అంటున్నారు. ఈ కాంబో సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తారని తెలుస్తుంది. రవితేజ తో అనిల్ సుంకర ఎప్పటి నుండో సినిమా తీయాలని భావిస్తున్నాడు. ఫైనల్ గా వీరు పోట్ల ప్రాజెక్ట్ తో ఇన్నాళ్లకి మాస్ మహారాజాతో ఓ సినిమా నిర్మించబోతున్నాడు.

Also Read: చైతన్యతో విడాకులు.. ఆ వీడియోతో నిహారిక క్లారిటీ ఇచ్చినట్లేనా?

Advertisement

Next Story