కప్పు కాఫీకోసం అర్థరాత్రి ఇంటికి పిలిచింది.. కాస్టింగ్ కౌచ్‌పై రవి కిషన్

by sudharani |
కప్పు కాఫీకోసం అర్థరాత్రి ఇంటికి పిలిచింది.. కాస్టింగ్ కౌచ్‌పై రవి కిషన్
X

దిశ, సినిమా: ప్రముఖ నటుడు, రాజకీయవేత్త రవి కిషన్.. తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి ఓపెన్ అయ్యాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద స్టార్‌గా ఎదిగిన ఓ మహిళ తనకు అర్ధరాత్రి ఓ కప్పు కాఫీ ఆఫర్ చేసిందని చెప్పాడు. రజత్ శర్మ చాట్ షో ‘ఆప్ కి అదాలత్‌’కు హాజరైన ఆయన.. ‘నేను కాస్టింగ్ కౌచ్ బాధితుడినే. ఓ రాత్రి ఊహించని సంఘటన జరిగింది. కప్పు కాఫీ కోసం తన ఇంటికి రమ్మని ఓ నటి పిలిచింది. కానీ, ఆ పరిస్థితి నుంచి నేను ఎలాగోలా తప్పించుకోగలిగాను. ఎదుకంటే నా పనిని నిజాయితీగా ముందుకు తీసుకెళ్లాలని మా నాన్న నేర్పించారు. మా అమ్మ నాకు జీవితమంతా మద్దతుగా ఉంది. అందుకే ఎప్పుడూ షార్ట్‌కట్స్ తీసుకోవాలనుకోలేదు. నేను ప్రతిభావంతుడినని నాకు తెలుసు’ అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నాడు.

Advertisement

Next Story