నా కూతురును అలాంటి పనులు చెయ్యమని చెప్పలేను: రవీనా టాండన్

by Prasanna |   ( Updated:2023-04-12 08:57:01.0  )
నా కూతురును అలాంటి పనులు చెయ్యమని చెప్పలేను: రవీనా టాండన్
X

దిశ, సినిమా : బాలీవుడ్‌లో నెపోటిజం గురించి రవీనా టాండన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవలే పద్మ శ్రీ అవార్డు అందుకున్న ఆమె తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పిల్లలు తమ తల్లిదండ్రులు, సన్నిహితులను అనుసరించడం సాధారణ విషయమని చెప్పింది. ‘ముఖ్యంగా సినిమా ఆర్టిస్టుల పిల్లల రక్తంలోనే కళ ఉంటుంది. నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా పనిని వాళ్లు స్పష్టంగా నేర్చుకుంటారు. చాలామంది అదే పద్ధతిని అనుసరిస్తారు. నా కూతురు రాషాకు ‘నువ్వు నీ సినీ పరిశ్రమలో నిలదొక్కుకోలేవు. కాబట్టి నాసా శాస్త్రవేత్త కావాలి’ అని నేను ఎప్పటికీ చెప్పలేను’ అంటూ తన అభిప్రాయాలను పంచుకుంది.

ఇవి కూడా చదవండి: Director Bobby: బంపర్ ఆఫర్ కొట్టేసిన దర్శకుడు బాబీ!

Advertisement

Next Story