60 ఏళ్ల వృద్ధుడితో సెక్స్ రిలేషన్.. చెప్పుతో కొడతానన్న నటి

by sudharani |   ( Updated:2022-09-25 09:15:31.0  )
60 ఏళ్ల వృద్ధుడితో సెక్స్ రిలేషన్.. చెప్పుతో కొడతానన్న నటి
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటి రతన్ రాజ్‌పుత్ తాను ఎదుర్కొన్న లైగింక వేధింపులపై ఓపెన్ అయింది. ఇండస్ట్రీలో అవకాశాలు లేక ఇటీవలే ఓ యూట్యూబ్ చానెల్ పెట్టిన ఆమె వరుస వీడియోలతో భారీ పాపులారిటీ సంపాదించింది. ఇందులో భాగంగానే ముంబైవాసుల జీవితంపై తీసిన వీడియో పోస్ట్ చేసిన నటి.. బాలీవుడ్‌లో అవకాశాల కోసం ముంబై వచ్చిన కొత్తలో ఎదురైన పలు భయంకరమైన అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. '14 ఏళ్ల క్రితం నటిని కావాలనే కోరికతో ముంబై వచ్చా. మొదటి నెలలోనే కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైంది.

60 ఏళ్లు దాటిన ఓ వ్యక్తిని సినిమా చాన్స్ కోసం కలిశా. నన్ను చూసిన వెంటనే బాడీ స్ట్రక్చర్, డ్రెస్సింగ్ స్టైల్‌ను దారుణంగా అవమానించాడు. వెంటనే అందంగా తయారవ్వాలంటే రెండు లక్షలకు పైగా ఖర్చవుతుందని, తనను గాడ్‌ఫాదర్‌ లేదా ఫ్రెండ్‌గా భావించి క్లోజ్‌గా ఉంటే డబ్బులిస్తానన్నాడు. అంతేకాదు అవసరం ఉన్నప్పుడు రాత్రిళ్లు గడపాలని చెప్పాడు. దీంతో నాకు కోపమొచ్చినా ఏమీ చేయలేకపోయా' అని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఒకవేళ అతని కూతురు నటి అయితే కూడా ఇలాగే బిహేవ్ చేస్తానని చెప్పడం ఆశ్చర్యమేసిందన్న రతన్.. ఆ అనుభవం గుర్తొచ్చినప్పుడల్లా భయం వేస్తుందని, అతనెప్పుడైనా కంటపడితే చెప్పుతో కొడతానంటూ ఫైర్ అయింది.

Also Read : రాఘవేంద్రరావు ఇంత ఘోరమా.. పాపం రంభను ఆ టైమ్‌లో అంతగా ఏడిపించారా?

Advertisement

Next Story