చాలా మిస్ అవుతున్నా.. నిన్ను కోల్పోయినందుకు బాధగా ఉందంటూ రష్మిక పోస్ట్

by Hamsa |   ( Updated:2024-07-17 15:20:22.0  )
చాలా మిస్ అవుతున్నా.. నిన్ను కోల్పోయినందుకు బాధగా ఉందంటూ రష్మిక పోస్ట్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న అందరికీ సుపరిచితమే. ఆమె టాలవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అలాగే హిందీలోనూ వరుస మూవీస్ చేస్తూ దూసుకుపోతుంది. గత ఏడాది ఈ అమ్మడు నటించిన యానిమల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇందులో రష్మిక నటనకు ప్రశంసలు అందాయి. ప్రస్తుతం ‘పుష్ప-2’ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉంది. అలాగే పలు సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా నిత్యం పలు పోస్టులు పెడుతూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

ఈ క్రమంలో.. తాజాగా, రష్మిక ఇన్‌స్టా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన పెట్ డాగ్ చనిపోవడంతో అమ్మడు భావోద్వేగ పోస్ట్ పెట్టింది. ‘‘ప్రశాంతంగా ఉండు నా లిల్ గూడెస్ట్ బోయియీ మాక్సి. మేము నిన్ను చాలా మిస్ అవుతున్నాము. నిన్ను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. మేము అతి త్వరలో ఒకరినొకరు కలుసుకుంటామని నేను నిజంగా ఆశిస్తున్నాను’’ అని రాసుకొచ్చింది. అలాగే తన డాగ్‌తో ఉన్న ఫొటో షేర్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed