విజయ్ దేవరకొండతో విడిపోతున్న Rashmika Mandanna ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

by Hamsa |   ( Updated:2023-07-07 05:54:27.0  )
విజయ్ దేవరకొండతో విడిపోతున్న Rashmika Mandanna ఎమోషనల్ పోస్ట్ వైరల్..!
X

దిశ, వెబ్ డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇటీవల వచ్చిన ‘పుష్ప’ సినిమాతో రష్మిక ఫ్యాన్స్‌లో ఫులు క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఈ అమ్మడు టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో డేటింగ్‌లో ఉన్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్ని రూమర్స్ వచ్చినా రౌడీ హీరో, రష్మిక మాత్రం స్పందించలేదు. ఇటీవల వీరిద్దరూ ఓ హోటల్‌లో తమ ఫ్యామిలీస్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారడంతో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని అందరూ అనుకున్నారు.

తాజాగా, రష్మిక తన ఇన్‌స్టా స్టోరీలో ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. విడిపోవడం గురించి చెప్పే ఓ ఇన్స్పిరేషన్ వీడియోను పోస్ట్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు విజయ్‌తో రష్మిక విడిపోతుంది అందుకే ఈ వీడియో షేర్ చేసింది అని అనుకుంటున్నారు. ప్రస్తుతం రష్మిక చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, రష్మిక పుష్ప-2, యానిమల్ వంటి చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంది.



Advertisement

Next Story