- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దాదాపు 5 నెలల తర్వాత ఆ ప్లేస్‌కు వెళ్లిన రష్మిక.. ఎమోషనల్ అవుతూ వీడియో
దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా లెవల్‌లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీ లైఫ్ లీడ్ చేస్తున్న రష్మిక.. ఇటీవల బాలీవుడ్‌లో ‘యానిమల్’ సినిమాతో అక్కడ కూడా స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ఇక తాజాగా హిందీలో ‘చావ’, తెలుగులో ఫుష్ప సీక్వెల్‌ను పూర్తి చెయ్యడంలో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా రష్మిక షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే.. రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో గత 4,5 నెలల నుంచి జిమ్‌కు దూరంగా ఉంటోంది. ఇప్పుడు తన పూర్తి ఫోకస్ జిమ్‌పై పెట్టాలని నిర్ణయించుకుందట ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే తను వర్కౌట్ చేస్తున్న వీడియో ఒకటి షేర్ చేస్తూ.. ‘నేను వర్కౌట్ వీడియోని షేర్ చేసి చాలా కాలం అయ్యింది. ఇన నుంచి నేను నా వర్కౌట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఇకపై కచ్చితంగా ప్రతి రోజు క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేస్తాను. దాదాపు 4/5 నెలలు అయ్యింది నేను వర్కౌట్ చెయ్యక. కానీ ఇప్పుడు నేను తిరిగి వచ్చాను. ఇప్పుడు మీరు ఈ వీడియోలను చాలా ఎక్కువగా చూస్తారు. తద్వారా ఎక్కడో, ఏదో ఒకవిధంగా ఇది మిమ్మల్ని కూడా ప్రేరేపిస్తుంది’ అని చెబుతూ క్రయింగ్ ఎమోజీలు షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.