- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దానికోసమే ప్రతిరోజూ పోరాటం చేస్తున్నా: రష్మిక
దిశ, సినిమా : స్టార్ నటి రష్మిక మందన్న ఉన్నతమైన లైఫ్ కోసం ప్రతిరోజు పోరాటం చేయాలంటోంది. ప్రస్తుతం ‘పుష్ప 2’ షూటింగ్లో బిజీ ఉన్న ఆమె తాజాగా ఓ సమావేశంలో వ్యక్తిగత విషయాలు వెల్లడించింది. ‘నేను సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి చాలా కష్టపడ్డాను. హాయిగా సాగుతున్న లైఫ్‌లో సినిమాలు ఎందుకు? అని మా పేరెంట్స్ ప్రశ్నించారు. ఇండస్ట్రీలో నెగ్గి చూపిస్తానని, నా మీద నాకు చాలా నమ్మకం ఉందని వాళ్లను ఒప్పించే సరికి తల ప్రాణం తోకలోకి వచ్చింది.
పేరెంట్స్‌ని ఒప్పించడం ఒక ఎత్తయితే, ఇండస్ట్రీలోకి వచ్చాక నిలదొక్కుకోవడం మరో ఎత్తు. ఇక్కడ రాణించడం అనుకున్నంత ఈజీ కాదు. నటించగలమనే కాన్ఫిడెన్స్ ఉంటే సరిపోదు. ప్రతిరోజూ ఇక్కడ పోరాటం చేయాలి. ఫ్యాషన్‌తో, సోషల్ మీడియాతోనే కాదు మనతో మనం పోరాడాలి. ఎప్పటికప్పుడూ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి’ అంటూ చెప్పకొచ్చింది.
ఇవి కూడా చదవండి : ‘మీటూ’పై సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అది కూడా వేధింపేనంటూ