Rashmika Mandanna: రష్మికకు ప్రమాదం.. ఆందోళన చెందుతున్న అభిమానులు (పోస్ట్)

by Hamsa |
Rashmika Mandanna: రష్మికకు ప్రమాదం.. ఆందోళన చెందుతున్న అభిమానులు (పోస్ట్)
X

దిశ, సినిమా: అందాలతార రష్మిక మందన్నా ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. అయితే అది చాలా చిన్న ప్రమాదమని, ప్రస్తుతానికి కోలుకుంటున్నానని ఆ పోస్ట్‌లో వెల్లడించారు రష్మిక. ''నేను సోషల్‌ మీడియలో యాక్టివ్‌గా ఉండి, పబ్లిక్‌లో కనిపించి చాలా రోజులైంది. అనుకోకుండా మైనర్‌ ప్రమాదం జరగడం వల్ల గత నెల యాక్టివ్‌గా ఉండలేకపోయాను.ఇప్పుడు ఆ యాక్సిడెంట్‌ నుంచి పూర్తిగా కోలుకున్నాను. జీవితం చాలా చిన్నది. రేపు ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి' అంటూ తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్‌ చేశారు ఈ నేషనల్‌ క్రష్‌. అయితే ప్రమాదం ఎలా జరిగింది? ఎక్కడా జరిగింది అనే విషయాన్ని ఆమె వివరించలేదు. అయితే ఈ విషయం తెలుసుకున్న తరువాత రష్మిక అభిమానులు ఆమెకు ఏమైందని ఆందోళన చెందుతూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం రష్మిక పుష్ప-2, కుబేర, సికందర్‌, రెయిన్‌ బో, దిగర్ల్‌ఫ్రెండ్‌ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed