‘రారా సామీ’ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన స్కూల్ గర్ల్.. రష్మిక క్యూట్ రియాక్షన్ వైరల్

by Prasanna |   ( Updated:2023-10-04 13:07:40.0  )
‘రారా సామీ’ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన స్కూల్ గర్ల్.. రష్మిక క్యూట్ రియాక్షన్ వైరల్
X

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన ‘పుష్ప’లోని ‘రారా సామీ’ సాంగ్ మరోసారి వైరల్ అవుతోంది. ఈ మూవీలో శ్రీవల్లీ క్యారెక్టర్‌లో అదరగొట్టేసిన రష్మిక సామీ సామీ సాంగ్‌లో నడుము ఊపుతూ వేసిన స్టెప్పులు యువతను ఊర్రూతలూగించిన సంగతి తెలిసిందే. కాగా ఈ డ్యాన్స్‌పై పెద్ద ఎత్తున్న రీల్స్ చేసి సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్ట్ చేయగా తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇందులో భాగంగానే దాదాపు ఓ ఐదేళ్ల వయసున్న మహారాష్ట్రకు చెందిన పాప తన స్కూల్ కల్చరల్ ప్రోగ్రామ్‌లో స్టేజ్‌పై రష్మిక స్టైల్‌లో చిందులేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుండగా దీనిపై స్పందించిన రష్మిక.. ‘సో క్యూట్’ అంటూ మురిసిపోతూ వీడియోను రీ పోస్ట్ చేయడం విశేషం. కాగా చిన్న వయసులోనే అదిరిపోయే ఫర్ఫార్మెన్స్ ఇచ్చిన చిన్నారిపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి.

Read More: తన ఒంటిపై ఉన్న టాటూల గురించి ఓపెన్‌గా చెప్పేసిన అనసూయ

Advertisement

Next Story