- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rashmika Mandanna: విజయ్‌తో ఉన్న తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న రష్మిక.. వైరల్‌గా మారిన వీడియో
దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రజెంట్ ‘పుష్ప 2’ చిత్రంతో బిజీగా ఉంది. కెరీర్ పరంగా మంచి ఫామ్‌లో ఉన్నా ఈ బ్యూటీ.. తాజాగా తను నటించిన ఓ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఈ మూవీ ఏంటంటే ‘డియర్ కామ్రేడ్’. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా 2019లో థియేటర్లలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అంతే కాకుండా ఈ మూవీ తర్వాత నుంచి రష్మిక, విజయ్ రిలేషన్‌లో ఉన్నట్లు కూడా వార్తలు గట్టిగానే వైరల్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ‘డియర్ కామ్రేడ్’ చిత్రం రిలీజై 5 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఓ పోస్ట్ షేర్ చేసింది రష్మిక.
‘‘డియర్ కామ్రేడ్’ సినిమాను ఆదరించిన, ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు.. స్క్రిప్ట్ నెరేషన్‌తో స్టార్ట్ ఈ జర్నీలో నెలలపాటు క్రికెట్ ట్రైనింగ్, గాయాలు.. నవ్వులతో సాగిన షూట్.. చిత్రీకరణ పూర్తైన రోజు భావోద్వేగ క్షణాలు ఎన్నో ఉన్నాచి. ఈ సినిమా తర్వాత నేను ఎన్నో మూవీస్ నటించినప్పటికీ ప్రేక్షకులు మాత్రం నన్నింకా ‘లిల్లీ’గానే గుర్తు పెట్టుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ క్షణం నాకెంతో స్పెషల్. భరత్, విజయ్ దేవరకొండతో పాటు చిత్ర నిర్మాణసంస్థకు స్పెషల్ థాంక్యూ’ అంటూ క్యాప్షన్ జోడించింది. ప్రజెంట్ రష్మిక పోస్ట్ వైరల్ అవుతుంటే.. విజయ్ అన్నయ్యతో ఉన్న తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నావా అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.