- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RASHMIKA-VIJAY: విజయ్ సాంగ్‌కు మాస్ స్టెప్పులేసి దుమ్మరేపిన రష్మిక మందన్న!
దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం బ్లాక్ బస్టర్ చిత్రాలతో దూసుకుపోతోంది. వరుస హిట్లు తన ఖాతాలో వేసుకుంటూ పోతుంది. టాలీవుడ్, బాలీవుడ్ హీరోలతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతి చాన్స్‌ను సద్వినియోగం చేసుకుంటుంది. కెరీర్ స్టార్టింగ్‌లో ఈ బ్యూటీ చిత్రాలు అంతగా హిట్ టాక్ సొంతం చేసుకోకపోయిన.. పర్వాలేదు అనిపించాయి. మెల్లిమెల్లిగా గ్లామర్ అండ్ తనలోని నటనా ప్రతిభను బయటపెట్టి అతితక్కువ సమయంలోనే నేషనల్ క్రష్‌గా ట్యాగ్ సంపాదించుకుంది. ‘పుష్ప, యానిమల్’ సినిమాల గురించైతే స్పెషల్‌గా చెప్పుకోనవసరం లేదు.
ఐకాన్ స్టార్ పక్కన ప్రియురాలు శ్రీవల్లిగా, బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్‌కు మంచి భార్యగా ఎంతో చక్కగా నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇకపోతే రష్మిక తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొని.. డాన్స్ ఇరగదీసింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వారిసు’ చిత్రంలోని ‘రంజితమే’ అనే సాగే పాటకు గ్రీన్ కలర్ శారీలో అదిరిపోయే స్టెప్పులేసింది. ప్రస్తుతం రష్మిక డాన్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. మరీ ఈ మూవీలో దళపతి విజయ్ సరసన ఈ బ్యూటీనే నటించింది. దిల్ రాజ్ నిర్మించిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది.
Rashmika dancing for Ranjithame in Karunagapally, Kollam (Kerala). pic.twitter.com/p8phqgYDWe
— AB George (@AbGeorge_) July 25, 2024