రణ్‌బీర్ కపూర్‌తో బోల్డ్ సీన్స్‌.. రెచ్చిపోతున్న రష్మిక

by Prasanna |   ( Updated:2023-10-10 07:11:50.0  )
రణ్‌బీర్ కపూర్‌తో బోల్డ్ సీన్స్‌.. రెచ్చిపోతున్న రష్మిక
X

దిశ, సినిమా: బాలీవుడ్‌లో ది మోస్ట్‌ వైలెంట్‌ మూవీగా తెరకెక్కుతోంది ‘యానిమల్‌’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్ బీర్‌, రష్మిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌ ఏ లెవల్లో విధ్వంసం సృష్టించిందో చెప్పనవసరం లేదు. దీంతో మేకర్స్ బ్యాక్‌ టు బ్యాక్‌ అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై వీర లెవల్లో అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ ఫస్ట్‌ సింగిల్‌ అప్‌డేట్‌ ప్రకటించారు. ‘అమ్మాయి..’ అంటూ సాగే సాంగ్‌ను బుధవారం రిలీజ్‌ చేస్తున్నట్లు ఓ స్పెషల్ పోస్టర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో రణ్‌బీర్‌, రష్మిక లిప్‌లాక్‌ చేసుకుంటున్నారు. చూడబోతే సందీప్ వంగ ఈ మూవీలో రష్మిక, రణ్‌బీర్‌లతో మంచి హాట్ సీన్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story