ఆ ఫెయిల్యూర్ నాకు గొప్ప పాఠాలు నేర్పింది.. రణ్‌వీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by samatah |   ( Updated:2023-08-04 07:46:56.0  )
ఆ ఫెయిల్యూర్ నాకు గొప్ప పాఠాలు నేర్పింది.. రణ్‌వీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌సింగ్ తన కెరీర్‌లో ఎదురైన సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ గొప్ప పాఠాలు నేర్పించాయంటున్నాడు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రణ్‌వీర్ తను నటించిన తాజా చిత్రం ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ వసూళ్లను ఉద్దేశిస్తూ కొన్ని అభవాలను అభిమానులతో పంచుకున్నాడు. ‘ఈ మధ్య కాలంలో నా సినిమాలు కొన్ని బాగా ఆడలేదు. అయితే ఆ పరాజయాల నుంచి కొన్ని మంచి విషయాలు నేర్చుకున్నాను. ఒక సినిమా సక్సెస్ అయితే అది నా సొంతం కాదు.. అందరిది. అలాగే ఫెయిల్యూర్ కూడా నా ఒక్కడికే వర్తించదు. సినిమాకు సంబంధించిన ప్రతి అంశం కూడా అంతే. ప్రతి ఒక్కరి జీవితంలో మంచి చెడులు ఉన్నట్లే నా లైఫ్‌లోనూ ఒడిదొడుకులున్నాయి’ అంటూ పలు విషయాలు ప్రస్తావించాడు. ఇక కరణ్ జోహార్ తెరకెక్కించిన ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ బాక్సాఫీస్ వద్ద ₹73.37 కోట్లు వసూల్ చేసింది.

Read More: భర్త కౌగిలిలో రొమాంటిక్‌గా.. బార్సిలోనా వేకేషన్ పిక్స్ షేర్ చేసిన నితిన్ భార్య

Advertisement

Next Story