- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇది సమాజానికి చెప్పాల్సిన కథ: 'మిసెస్ ఛటర్జీ vs నార్వే'పై రాణీ ముఖర్జీ
దిశ, సినిమా : బాలీవుడ్ సీనియర్ యాక్ట్రెస్ రాణీ ముఖర్జీ లేటు వయసులోనూ తన అధ్బుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇటీవల వచ్చిన 'బంటీ ఔర్ బబ్లీ 2'లో సత్తా చాటిన ఆమె.. ప్రస్తుతం 'మిసెస్ ఛటర్జీ vs నార్వే'తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ సినిమా నుంచి రాణి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. పింక్ కలర్ శారీ ధరించిన నటి చేతిలో బొమ్మ, టాబ్లెట్ కవర్, హ్యాండ్ బ్యాగ్‌తో ముఖర్జీ దర్శనమివ్వగా.. ఆమె చూపులు దేనికోసమో ఆతృతగా వెతుకుతున్నట్లు అర్థమవుతోంది. ఇక ఈ బ్యూటిఫుల్ పిక్‌ను నెట్టింట షేర్ చేసిన జీ స్టూడీయోస్ నిర్మాణ సంస్థ.. 'తన పిల్లలను తిరిగి గెలవడానికి ధైర్యం, సంకల్ప శక్తితో పోరాటం చేస్తూ దేశం మొత్తాన్ని కదిలించిన ఒక నిజమైన తల్లి కథ నుంచి ప్రేరణ పొందింది' అంటూ రాసుకొచ్చారు. అషిమా చిబ్బర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2023 మార్చి3న థియేటర్లలో విడుదల కానుంది. చివరగా 'ఈ చిత్రం నా హృదయానికి దగ్గరగా ఉంది. ఇది సమాజానికి చెప్పాల్సిన కథ. ఈ అద్భుతమైన స్టోరీ ప్రతి భారతీయుడికి ప్రతిధ్వనిస్తుందని ఆశిస్తున్నా. ప్రజలకు గొప్ప సందేశాన్ని అందిస్తుందని నమ్ముతున్నా' అంటూ సినిమా గురించి రాణి తన అభిప్రాయాన్ని వెల్లడించింది.