- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Rangamarthanda: రంగమార్తాండ సినిమా రివ్యూ
దిశ, వెబ్ డెస్క్ : ఓ సినిమా విడుదలకు ముందే ప్రీమియర్ షో వేయడానికి ఘట్స్ ఉండాలి. అలాంటిది సెన్సార్ కూడా అవ్వకుండానే రంగమార్తాండ ప్రీమియర్ షో ఏర్పాటు చేసారు డైరెక్టర్ కృష్ణ వంశీ. దాని బట్టి ఈ సినిమాని కృష్ణ వంశీ ఎంత ప్రేమించాడో తనపై తాను ఎంత విశ్వాసం ఉంచుకున్నాడో తెలుస్తుంది.
మరాఠిలో క్లాసిక్ అనిపించుకున్న నట సామ్రాట్ కి ఇది రీమేక్. నిజానికి ఇలాంటి సినిమా చేయాలంటే పెద్ద సవాలే అని చెప్పుకోవాలి. మరాఠిలో ఈ సినిమాలో నటించిన వారందరూ కెరీర్లో బెస్ట్ యాక్టింగ్ ఇచ్చేసారు. విడుదలకు ముందే రంగమార్తాండ ప్రీమియర్ షో జరిగింది. దాదాపు వంద మందికి ఈ సినిమాని చూపించారు. ఈ షో చూసిన వాళ్లంతా సినిమా ఐపోయాక ఒకటే మాట చెప్పారు.. కృష్ణ వంశీ ఈజ్ బ్యాక్ అని. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ , బ్రహ్మ నందం , రమ్య కృష్ణ సినిమాకి ప్రాణం పెట్టేసారు. ప్రకాష్ రాజ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. కానీ బ్రహ్మి ఈ సినిమాలో మ్యాజిక్ చేశారనే చెప్పుకోవాలి. చక్రి అనే పాత్రలో నటించి పాత్రకు తగిన న్యాయం చేసారు. ఈ సినిమా తర్వాత రచయితలు, దర్శకులు బ్రహ్మ నందం చూసే కోణం మారిపోతుందనే చెప్పుకోవాలి. ఒక సీన్లో అయితే ప్రకాష్ రాజ్ ని , బ్రహ్మి డామినేట్ చేశారనే చెప్పుకోవాలి.అంతే కాకుండా సినిమాలో భార్య భర్తల అనుబంధానికి కృష్ణ వంశీకి మంచి మార్కులు పడతాయి. రాజుగారు అని పిలుస్తూ సేవలు చేయడంఇలాంటివి ఎన్నో సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇళయరాజా సంగీతం , పాటలు సినిమాకు ప్లస్ అయ్యిందనే చెప్పుకోవాలి. పిల్లలను అతిగా ప్రేమించే అమ్మ నాన్నలకు కూడా తనదైన రీతిలో గట్టిగానే హెచ్చరించాడు. మొత్తానికి కృష్ణ వంశీ హిట్ కొట్టేసినట్టే అని చెప్పుకోవాలి.
Read more: