రంగ రంగ వైభవంగా ట్విట్టర్ రివ్యూ..

by Hamsa |   ( Updated:2022-09-02 07:10:13.0  )
రంగ రంగ వైభవంగా ట్విట్టర్ రివ్యూ..
X

దిశ, సినిమా : మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌, కేతికా శ‌ర్మ జంట‌గా గిరీశాయ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కిన చిత్రం 'రంగ రంగ వైభవంగా'. ఈ రోజే(శుక్రవారం) థియేటర్స్‌లో విడుదలవగా.. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్‌ వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. పలువురు ఈ చిత్రాన్ని మంచి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌‌గా పేర్కొంటుంటే.. మరికొందరు మాత్రం రొటీన్‌ ఫ్యామిలీ డ్రామా అంటూ పెదవి విరుస్తున్నారు.

అంతేకాదు ఆసక్తి కలిగించే అంశాలేం లేవని చెబుతున్నారు. యాక్టర్ సత్య కామెడీ సీన్స్‌‌ తప్ప సినిమాలో విషయం లేదని, సెకండాఫ్‌‌తో పోలిస్తే ఫస్టాఫ్‌ కాస్త బెటర్‌ అని తేల్చేస్తున్నారు. ఓవరాల్‌గా 'రంగరంగ వైభవంగా' విషయంలో మిక్స్‌డ్ టాక్ వినిపిస్తుండగా.. ఈ సినిమాకు DSP మ్యూజిక్ కొంత ప్లస్ అయ్యిందని అంటున్నారు.

Advertisement

Next Story