Ranbir నీ భార్యను వదిలెయ్.. Alia బాడీపై ట్రోలింగ్

by Hamsa |   ( Updated:2022-08-19 08:32:23.0  )
Ranbir నీ భార్యను వదిలెయ్.. Alia బాడీపై ట్రోలింగ్
X

దిశ, సినిమా: యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ మరోసారి నెట్టింట ట్రోలింగ్‌ ఎదుర్కొంటున్నాడు. గర్భవతి అయిన భార్య అలియా భట్ బరువెక్కడంపై చేసిన కామెంట్స్‌తో తిట్లుతింటున్నాడు. తాజాగా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, అలియా భట్‌తో కలిసి 'బ్రహ్మాస్త్ర' ప్రమోషన్స్‌లో పాల్గొన్న రణ్‌బీర్.. ఆమె భారీ ఆకారం సినిమా ప్రమోటింగ్‌లో అట్రాక్ట్‌గా లేదని కామెంట్ చేశాడు. దీనిపై వెంటనే స్పందించిన ఆమె.. 'మేము అన్ని పనులు చేస్తాం. ప్రతీ చోట మీతోపాటు సమానంగా ఉంటున్నాం.

అయినా ఎందుకు చులకనగా మాట్లాడున్నారు' అని ప్రశ్నించింది. దీంతో ఇదంతా జోక్ అని ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసినా.. అలియా ఫ్యాన్స్ మాత్రం ఆటాడేసుకున్నారు. 'నిజాయితీగా, నిస్సందేహంగా చెప్పాలంటే రణ్‌బీర్ ప్రతీసారి అలియాను విమర్శిస్తున్నాడు. ఇది చాలా తప్పు. బహిరంగ ప్రసారాల్లో ఇలాంటి కామెంట్ ఎందుకు చేయాలి? అవును ఆమె గర్భవతి కాబట్టి బాడీ ఇమేజ్ సమస్యలు ఉన్నాయి. తప్పేంటి?. నీకు నచ్చకపోతే ఆమెను ఒంటరిగా వదిలెయ్' అని తమ అభిమాన నటికి మద్ధతుగా నిలుస్తున్నారు.

Also Read: మహేశ్ బాబు 'Sarkaru Vaari Paata' అరుదైన రికార్డు

Advertisement

Next Story