Ranbir Kapoor - Alia Bhatt : రణ్‌బీర్ బర్త్ డే.. అలియా స్పెషల్ పోస్ట్ వైరల్

by sudharani |   ( Updated:2023-09-28 08:35:15.0  )
Ranbir Kapoor - Alia Bhatt : రణ్‌బీర్ బర్త్ డే.. అలియా స్పెషల్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడు నటుడు, భర్త రణ్‌బీర్ కపూర్ బర్త్ డే సందర్భంగా అలియా భట్ స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది. ఈ ఏడాదితో 41వ పడిలోకి అడుగుపెడుతున్న తన హస్బెండ్‌పై ప్రశంసలు కురిపిస్తూ ప్రేమగా అతన్ని ముద్దుపెట్టుకుంటున్న ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ‘మై లవ్. మై బెస్ట్ ఫ్రెండ్. మై హ్యాపీయెస్ట్ ప్లేస్. మీరు నా పక్కనే కూర్చొని మీ సీక్రెట్ అకౌంట్ నుంచి ఈ క్యాప్షన్‌ను చదువుతున్నప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే. హ్యాపీ బర్త్‌డే బేబీ. యు మేక్ ఇట్ ఆల్ మ్యాజికల్’ అంటూ తనదైన స్టైల్‌లో నోట్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. సెలబ్రిటీలు, అభిమానులతోపాటు నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున్న హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Advertisement

Next Story