తెరపైకి రణ్ బీర్, రష్మిక జంట.. ఏడుస్తున్న అలియా భట్

by sudharani |   ( Updated:2024-04-01 12:28:23.0  )
తెరపైకి రణ్ బీర్, రష్మిక జంట.. ఏడుస్తున్న అలియా భట్
X

దిశ, సినిమా : 'యానిమల్ 'తో సూపర్ డూపర్ రొమాంటిక్ పెయిర్‌గా అప్లాజ్ అందుకున్న రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్న.. మరోసారి పెయిర్ అప్ అయ్యారు. 7Up యాడ్ కోసం జంటగా కనిపించారు. తాజాగా విడుదలైన ఈ యాడ్ ప్రోమో నిజంగానే సమ్మర్ రిఫ్రెష్‌గా కనిపిస్తుండగా.. ఈ జంటకు తిరుగులేదని అంటున్నారు నెటిజన్లు. ఈ జోడీ మళ్లీ మళ్లీ రిపీట్ అయ్యే అవకాశం ఉందని.. అలియా భట్‌ను జలస్ ఫీల్ అయ్యేలా చేస్తుందని కామెంట్స్ పెడుతున్నారు. ఆమె ఏడుస్తున్న ఎమోజీలు పోస్ట్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రష్మిక.. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న 'ది గర్ల్ ఫ్రెండ్ ' షూటింగ్‌లో బిజీగా ఉండగా.. ఫస్ట్ టైం మలయాళంలోనూ డబ్బింగ్ చెప్పుకుంటుంది.

Advertisement

Next Story