- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Successful Heroines : ఇద్దరు హీరోయిన్లను చీట్ చేశా.. ఇప్పుడు కూడా.. పాన్ ఇండియా హీరో షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ' యానిమల్ ' సినిమాతో రీసెంట్ సక్సెస్ అందుకున్నాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కంటెంట్ కొందరి నుంచి విమర్శలు అందుకుంటే.. మరికొందరు మాత్రం ప్రశంసల వర్షం కురిపించారు. మొత్తానికి ఈ ఫిల్మ్ తో ఈ రాకింగ్ స్టార్ బ్లాక్ బస్టర్ కమ్ బ్యాక్ ఇచ్చేశాడు. పాన్ ఇండియా లెవల్ లో సత్తా చాటాడు. కొత్తగా సౌత్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కానీ బాలీవుడ్ మాత్రం తనను ఇంకా తప్పు చేసినవాడిగానే ట్రీట్ చేస్తుందని తాజా ఇంటర్వ్యూలో బాధపడ్డాడు.
' నేను ఇద్దరు సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ దీపికా పదుకునే, కత్రినా కైఫ్ తో డేటింగ్ చేశా. విడిపోయా. ప్రస్తుతం అలియా భట్ ను పెళ్లి చేసుకున్నా. కానీ ఇప్పటికీ తనను ఇండస్ట్రీ చీటర్ గానే చూస్తుంది. ఇద్దరిని మోసం చేసిన వ్యక్తి మాదిరిగానే ట్రీట్ చేస్తుంది. ఆ నిందను ఇంకా మోస్తున్నా ' అని చెప్తూ బాధపడిపోయాడు. ఇక ఈ కామెంట్స్ పై స్పందిస్తున్న ఫ్యాన్స్.. ఆయనను సపోర్ట్ చేస్తున్నారు. తెలిసీ తెలియక చేసిన తప్పు...తప్పే కాదంటున్నారు. పైగా వారిని కావాలని మోసం చేసి ఉండడని.. అయినా దీపిక, కత్రినా కూడా పెళ్లి చేసుకుని సెటిల్ అయినప్పుడు ఇంత బాధపడనవసరం లేదని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.