‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి’ రికార్డులను ‘ప్రాజెక్ట్-కె’ బ్రేక్ చేస్తుంది.. స్టార్ హీరో వ్యాఖ్యలు వైరల్

by sudharani |   ( Updated:2023-06-02 10:06:27.0  )
‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి’ రికార్డులను ‘ప్రాజెక్ట్-కె’ బ్రేక్ చేస్తుంది.. స్టార్ హీరో వ్యాఖ్యలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ప్రాజెక్ట్-కె’. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రేక్షకులు సినిమాపై భారీ ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్టార్ హీరో రానా ‘ప్రాజెక్ట్-కె’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రానా మాట్లాడుతూ.. ‘‘ప్రభాస్ ‘ప్రాజెక్ట్-కె’ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు ప్రేక్షకులతో పాటు నేను కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడూ రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఈ మూవీ గ్లోబల్ స్థాయలో గుర్తింపు తెచ్చుకుంటుందని నేను చాలా నమ్మకంగా ఉన్నాను. ఇప్పటి వరకు ఉన్న ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి’ రికార్డులను ఈ మూవీ బ్రేక్ చేస్తుంది. టాలీవుడ్‌లో ఒక హీరో సినిమాను మరో హీరో సపోర్ట్ చేస్తూ సెలబ్రెట్ చేసుకుంటారు’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read..

రెమ్యూనరేషన్ విషయంలో సుమ టాప్.. ఒక్క షోకు ఎంతంటే..?

ఆ పార్ట్‌కు సర్జరీ చేయించుకున్న నిధి అగర్వాల్..! అవసరమా అంటున్న నెటిజన్లు

Advertisement

Next Story