- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rana – Miheeka : నాలుగో వెడ్డింగ్ యానివర్సరీ.. నువ్వే నా ప్రశాంతత అంటూ స్పెషల్ ఫొటో షేర్ చేసిన మిహికా బజాజ్
దిశ, సినిమా : హీరో రానా దగ్గుబాటి ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా సమయంలో అతి కొద్దీ సన్నిహితుల మధ్య 2020లో మిహికా బజాజ్ తో రానా వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకను సింపుల్ గానే చేసుకున్నా.. హైద్రాబాద్ వచ్చాక గ్రాండుగా రిసెప్షన్ జరిగింది. ఈ రోజుకి పెళ్ళై నాలుగేళ్లు అవుతుండటంతో రానా వైఫ్ మిహికా బజాజ్ ఇంస్టాగ్రామ్ లో స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది.
విదేశాల్లో ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోని ఆమె అకౌంట్లో షేర్ చేసి మిహికా బజాజ్.. " జీవితం ఎప్పుడూ మనకీ నచ్చినట్టు అసలు ఉండదు. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వే నా ప్రశాంతత, నా హ్యాపినెస్. ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు నాతోనే ఉన్నందుకు నాకు చాలా సంతోషం. అన్నింటి కంటే నువ్వే నాకు ఎక్కువ.. నీ కంటే నాకు ఏది ఎక్కువ కాదు నీ ప్రేమ తప్ప నాకు సంతోషాన్ని ఇచ్చే ప్రేమ ఇంకోటి లేదు " అంటూ పోస్ట్ చేసింది.
దీంతో మిహికా బజాజ్ పెట్టిన ఈ పోస్ట్ ట్రెండ్ అవుతుంది. ఇది చూసిన ఫ్యాన్స్ వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ తెలుపుతున్నారు. మరి కొందరు మీ లాగే నాగ చైతన్య, సమంతా కలిసి ఉంటే చాలా బావుండేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
- Tags
- Hero Rana