నా కుడి కన్ను అస్సలు కనిపించదు.. వ్యక్తిగత విషయాలు బయటపెట్టిన రానా

by sudharani |   ( Updated:2023-03-17 06:20:49.0  )
నా కుడి కన్ను అస్సలు కనిపించదు.. వ్యక్తిగత విషయాలు బయటపెట్టిన రానా
X

దిశ, వెబ్‌డెస్క్: రానా దగ్గుపాటి హెల్త్‌కి సంబంధించి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాడని అప్పట్లో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే రానా కిడ్నీ మార్పిడి కూడా చేయించుకున్నాడు అనే వార్తలు రావడం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు రానా. ‘‘రానా నాయుడు’’ అనే సిరీస్‌తో రానా OTT అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. బాబాయ్ వెంకటేష్‌తో కలిసి చేసిన ఈ సిరీస్ ప్రమోషన్స్‌కు సంబంధించిన ప్రచార ఇంటర్వ్యూల్లో పాల్గొన్న రానా తన ఆరోగ్య సమస్యలపై వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చాడు.

రానా మాట్లాడుతూ.. ‘‘చిన్న నాటి నుంచి నా కుడి కన్ను కనిపించదు. అదే విధంగా కిడ్నీ సంబంధిత సమస్యతో కూడా బాధపడ్డాను. ఆ రెండికి శస్త్ర చికిత్స చేయించుకున్న. అయితే చాలా మందికి శారీరక సమస్యలు వస్తే బాధపడతారు. సమస్యలు తొలగిపోయినప్పటికి వాటిని తలుచుకుని బాధపడుతుంటారు. నాకు అదే విధంగా జరిగింది. కానీ ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చి ప్రతి ఒక్కరు కెరీర్‌లో ముందుకెళ్లాలి’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Read more:

టైట్‌గా ఉంటేనో, బ్లెడ్ వస్తేనో వర్జిన్ కాదు.. ప్రముఖ సింగర్ వీడియో వైరల్

Advertisement

Next Story