‘#Thalaivar 170’లో భల్లాలదేవుడు.. ఇక ఫ్యాన్స్‌కు గూస్ బంప్సే

by Prasanna |   ( Updated:2023-10-03 12:25:36.0  )
‘#Thalaivar 170’లో భల్లాలదేవుడు.. ఇక ఫ్యాన్స్‌కు గూస్ బంప్సే
X

దిశ, సినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్‌ హీరోగా ‘జై భీమ్‌’ ఫేమ్ టీజే జ్ఞానవేళ్‌ తెరకెక్కించబోతున్న ‘#Thalaivar 170’ నుంచి వరుస అప్ డేట్‌లు వెలువడుతున్నాయి. రీసెంట్‌గా యంగ్ బ్యూటీ దుషారా విజయన్ ఇందులో కీలక పాత్ర పోషించబోతున్నట్లు వెల్లడించిన మూవీ టీమ్.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి కూడా ఇందులో నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో రానా లుక్ రిలీజ్ చేసింది. ఈ మేరకు ‘ది డాపర్ & సూపర్ కూల్ టాలెంట్ Mr.Rana Daggubati ఆన్ బోర్డ్ ఫర్ #Thalaivar170. డాషింగ్ యాక్టర్ రాకతో మా టీమ్ మరింత ఆకర్షణీయంగా, బలంగా మారింది’ అంటూ పోస్ట్‌కు క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుండగా ఇరువురి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబాస్కరన్‌ నిర్మిస్తున్న సినిమాలో అమితాబ్‌, ఫహద్‌ ఫాజిల్, మంజువారియర్ వివిధ పాత్రలు పోషిస్తుండగా ఇప్పటికే మూవీపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించనున్న ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read More: అందుకేనా.. నాగార్జున, టబును విడిచిపెట్టడం లేదు..?

Advertisement

Next Story